Tuesday 25 September 2012

నిన్న  నాన్న 102 వ birthday జూబిలీ హాల్ లో చాలా బాగా జరిగింది. Dy.CM గారు కూలి రాజు translation ని రిలీజ్ చేశారు. ఈ ట్రాన్స్ లే షన్ శ్రీ చంద్ర మౌళి గారు "Coolie the Sovereign" అనే పేరుతో చేశారు.

భీమన్న పురస్కారం-2012 ని డా.రావూరి భరద్వాజ గారికి ప్రదానం చేశారు. ఆయనా, శ్రీ  కోయి కోటేశ్వరరావు గారు ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుండేది అనిపించింది.

అంతకు ముందు విజయలక్ష్మి శర్మ గారు, శ్రీదేవి గారు నాన్న రాసిన లలిత గీతాలు చాలా బాగా పాడారు. అమ్మ ప్రార్ధన గా "నమస్కారం" పాడింది.

ఇప్పటికైనా నాన్న పుస్తకాలు గోడౌన్ నుంచి బైటికి తెస్తామని అన్నారు. చూడాలి.
 

Friday 21 September 2012



ఇది భీమన్న చిన్నప్పటి ఫొటో. బహుశా బి.ఈ డి చేస్తున్నప్పటిది.

భీమన్న పురస్కారం- 2012 ను శ్రీ రావూరి భరద్వాజ గారికి ప్రకటిస్తున్నాం . ఇది ఇప్పటికి ఏడవ పురస్కారం.
2006 వ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది భీమన్న జయంతి ఉత్సవాల సందర్భంలో ఈ పురస్కారం ఇవ్వబడుతోంది. ఇప్పటి వరకు ఈ పురస్కారాలు పొందిన వారు శ్రీ కత్తి పద్మారావు, కీ.శే గుర్రం జాషువ గారు , కీ.శే ఎం.ఎస్ రెడ్డి గారు, శ్రీ అద్దేపల్లి రామమోహనరావు గారు, శ్రీ ఆవంత్స సోమసుందర్ గారు, శ్రీ గోపి గారు.
ఈ నెల 24వ తేదిన పురస్కార ప్రదానం జరుగుతుంది.
 

Wednesday 19 September 2012

భీమన్న 102 వ జయంతి అసలు ఈ రోజున, అంటే 19 వ తేదీ న. అయితే ఈ రోజు వినాయక చవితి అవడం వల్ల  జయంతి  ఉత్సవం ఈ నెల 24 వ తేదీ న జూబిలీ హాల్ లో జరపబడుతోంది. అందరూ రావాలని కోరుతున్నాను.

Sunday 16 September 2012


బోయి భీమన్న. కామ్ వెబ్సైటు లో భీమన్న రచనలు  కొన్ని పెట్టాం. చాలా మంది ఆయన రచనలు దొరకడం లేదని అడుగుతూ ఉన్నారు. చదవాలనుకున్నవాళ్ళు రచనలు pdf files డౌన్లోడ్ చేసుకోవచ్చు.
 
రాభీలు పాటలు కూడా ఇందులో ఉన్నాయి.

Bhimanna Peetham back to Telugu University

భీ మ న్న  సాహిత్య  పీఠం  తెలుగు అకాడెమి  నుంచి   మళ్లీ  పొట్టి  శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కి  మార్చబడింది.